Layoffs: టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ లోనూ ఉద్యోగాల కోతలు.. మూడు నెలల్లో 11,781 మందికి ఉద్వాసన

ఆర్థిక మాంద్యం భయాలు, వ్యయ నియంత్రణ చర్యలు వెరసి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతను కొనసాగిస్తున్నాయి.

Layoff Representational Image (File Photo) (Photo Credits: Pixabay)

Hyderabad, Jan 13: గూగుల్‌ (Google), ఫ్లిప్‌ కార్ట్‌ (Flipkart), యూనిటీ సాఫ్ట్‌ వేర్‌, పేటీఎం, అమెజాన్‌ (Amazon) తదితర ఐటీ, ఈ-కామర్స్‌ కంపెనీలు ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులను తొలగించగా ఇప్పుడు ఆ జాబితాలోకి దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్‌ (TCS), ఇన్ఫోసిస్‌ చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్‌-డిసెంబర్‌) ఈ రెండు కంపెనీలు ఏకంగా 11, 781 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్స్‌ ఇచ్చినట్టు పారిశ్రామికవర్గాలు తెలిపాయి. ఇందులో టీసీఎస్‌ 5,680 మందిపై వేటు వేయగా, ఇన్ఫీ 6,101 మందికి ఉద్వాసన పలికింది. ఆర్థిక మాంద్యం భయాలు, వ్యయ నియంత్రణ చర్యలు వెరసి దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతను కొనసాగిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

Madras High Court About Porn Videos: అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడడం తప్పేమీ కాదు.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. వీడియోలు చూసినవారిపై నిందలు మానేసి వారిని ఆ వ్యసనం నుంచి బయటపడే మార్గాలు చూడాలని హితవు