Chennai, Jan 13: స్మార్ట్ ఫోన్ (Smart Phone) లో చిన్నారుల పోర్న్ వీడియోలను (Porn Videos) చూసినట్టు నమోదైన ఓ కేసులో మద్రాస్ హైకోర్టు (Madras Highcourt) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే.. స్మార్ట్ ఫోన్ లో చిన్నారుల పోర్న్ వీడియోలను చూసినట్టు తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ అంబత్తూరుకు చెందిన యువకుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా.. కోర్టుకు హాజరైన యువకుడు తాను అశ్లీల సినిమాలు చూడడం నిజమేనని, కాకపోతే తాను చూసినవి పిల్లలకు సంబంధించినవి కావని కోర్టుకు తెలిపాడు. ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్ తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. వాదోపవాదాల అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
Watching porn is an addiction for young generation; punishment is not the solution: Madras high court
Read: https://t.co/I764eKO2JS pic.twitter.com/T9agnCm3P5
— The Times Of India (@timesofindia) January 12, 2024
షేర్ చేస్తేనే..
అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడడంలో ఎలాంటి తప్పు లేదని, వాటిని ఇతరులకు షేర్ చేస్తేనే నేరమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 1990లలోని యువత మద్యం, ధూమపానానికి ఎలా అలవాటయ్యారో, 2కే కిడ్స్ కూడా అలాగే అశ్లీల చిత్రాలకు బానిసలుగా మారారని తెలిపారు. వారిపై అనవసరంగా నిందలు మోపడం మాని ఆ అలవాటు నుంచి వారు బయటపడేందుకు అవసరమైన సలహాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.