Amazon Web services to invest Rs 60,000 crore in Hyderabad (photo/X/Congress)

Hyd, Jan 23: దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణ సీఎం భారీ పెట్టుబడులను రాష్ట్రానికి రాబట్టే లక్ష్యంగా కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. తాజాగా తెలంగాణలో భారీ పెట్టుబడికి దిగ్గజ సంస్థ అమెజాన్‌ (Amazon) ముందుకొచ్చింది.

దావోస్‌లో అమెజాన్‌ వెబ్‌సర్వీసెస్‌ గ్లోబల్‌ పబ్లిక్‌ పాలసీ వైస్‌ ప్రెసిడెంట్‌ మైకేల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రూ.60వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు (Amazon Web services to invest Rs 60,000 crore) అమెజాన్‌ అంగీకారం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. ఈ పెట్టుబడితో (CM Revanth Reddy Davos Tour Highlights) రాష్ట్రంలో డేటా సెంటర్లను అమెజాన్‌ విస్తరించనుంది. వీటికి అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం కూడా తెలిపింది.

హైదరాబాద్‌లో విప్రో విస్తరణ..గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్‌, వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

అలాగే ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌వో సంగ్రాజ్‌తో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో పోచారంలో ఐటీ క్యాంపస్‌ విస్తరణకు ఇన్ఫోసిస్‌ అంగీకారం తెలిపింది. రూ.750కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడతామని ఆ సంస్థ తెలిపింది. దీంతో కొత్తగా 17వేల ఉద్యోగాలు రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఇక విప్రో (Wipro) ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీతో సీఎం రేవంత్‌ భేటీ (CM Revanth Reddy Davos Tour) అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.ఈ భేటీలో హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో కొత్త సెంటర్‌ ఏర్పాటుకు విప్రో అంగీకారం తెలిపింది. మూడేళ్లలో సెంటర్‌ పూర్తిచేస్తామని వెల్లడించింది. విప్రో కొత్త సెంటర్‌ ద్వారా 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు కంపెనీ తెలిపింది.

CM Revanth Reddy Davos Tour Highlights:

నిన్న (జనవరి 22) మూడు కంపెనీల ద్వారా రాష్ట్రానికి రూ.56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. ఈ పెట్టుబడులు రాకతో తెలంగాణ యువతకు సుమారు 10,800 ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇంధన రంగ దిగ్గజం సన్‌ పెట్రో కెమికల్స్‌ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్‌ పెట్రో కెమికల్స్‌ ఎండీ దిలీప్‌ సాంఘ్వీ అంగీకారం తెలిపారు. నాగర్‌కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ పంప్డ్‌ స్టోరేజీ, సోలార్‌ విద్యుత్తు ప్రాజెక్టులను రాష్ట్రంలో ఈ కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఈ మూడు ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు. వీటికి 5,440 మెగావాట్ల సామర్థ్యముండే సోలార్‌ విద్యుత్తు ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7,000 ఉద్యోగాలు లభిస్తాయి.

చంద్రబాబుకు కంప్యూటర్‌ గురించి ఏమీ తెలియదు...దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కనీసం కంప్యూటర్ ఆన్‌,ఆఫ్ చేయడం కూడా తెలియదని షాకింగ్ కామెంట్

తెలంగాణలో మరో అత్యాధునిక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయనున్నట్లు కంట్రోల్‌ ఎస్‌ డేటా సెంటర్స్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై కంట్రోల్‌ ఎస్‌ సీఈవో శ్రీధర్‌ పిన్నపురెడ్డి సంతకం చేశారు.ఈ కంపెనీ 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ నెలకొల్పుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 3,600 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

తెలంగాణలో మానవ రహిత ఏరియల్‌ సిస్టమ్స్‌ తయారీ యూనిట్‌ స్థాపించనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఎండీ పార్థ్‌ జిందాల్‌ ప్రకటించారు. అమెరికాకు చెందిన డిఫెన్స్‌ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్‌ నెలకొల్పనుంది. దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనికి సంబంధించి దావోస్‌లో జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్‌ అనుబంధ సంస్థ అయిన జేఎస్‌డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్‌ బుధవారం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా దాదాపు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

ఇక ప్రముఖ గ్లోబల్‌ టెక్నాలజీ కంపెనీ ‘హెచ్‌సీఎల్‌’ హైదరాబాద్‌లో కొత్త టెక్‌ సెంటర్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, హెచ్‌సీఎల్‌ టెక్‌ గ్లోబల్‌ సీఈవో, ఎండీ సి.విజయకుమార్‌తో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో చర్చలు జరిపారు. హైటెక్‌ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ సిద్ధమవుతోంది. దీంతో 5 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి.