67th National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ, ఉత్తమ పాపులర్ చిత్రంగా మహర్షి, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో మరో అవార్డు కైవసం చేసుకున్న నాని జెర్సీ
చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. ఈ అవార్డులను అందుకున్నారు.
చిత్రసీమలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం (67th National Film Awards) సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నాని హీరోగా నటించిన 'జెర్సీ' సినిమా ఉత్తమ తెలుగు చిత్రంతో పాటు ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలను (Jersey Movie Awards) అందుకుంది. చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ.. ఈ అవార్డులను అందుకున్నారు. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ సహా బెస్ట్ కొరియోగ్రాఫీ విభాగాల్లో 'మహర్షి' సినిమా (Maharshi Movie Awards) తరఫున దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు అందుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)