67th National Film Awards: తెలుగు సినిమాకు అయిదు జాతీయ అవార్డులు, సత్తా చాటిన నాని జెర్సీ, మహేష్ బాబు మహర్షి సినిమాలు, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం, ఉత్తమ నిర్మాణ సంస్థగా శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌

67వ జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు చెందిన రెండు సినిమాలు ఐదు అవార్డులతో సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో (67th National Film Awards) సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’కి మూడు అవార్డులు, న్యాచురల్‌ స్టార్‌ నాని సినిమా ‘జెర్సీ’కి రెండు అవార్డులు (Tollywood industry gets 5 national awards) దక్కాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంతో మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించింది. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించే ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం, ఉత్తమ నిర్మాణ సంస్థగా దిల్‌రాజుకు చెందిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ అవార్డులు పొందాయి.

Mahesh Babu in Maharshi (Photo Credits: Twitter)

ఉత్తమ తెలుగు చిత్రంగా నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘జెర్సీ’ ఎంపికైంది. దీంతోపాటు ఉత్తమ ఎడిటర్‌గా నవీన్‌ నూలి జాతీయ అవార్డు దక్కించుకున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement