National Film Awards: వీడియో ఇదిగో, బన్నిని కౌగిలించుకుని ఏడ్చేసిన దర్శకుడు సుకుమార్, అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్న ఇరువురి ఆత్మీయత

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటన వెలువడగానే బన్నీ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి తదితరులు అల్లు వారి ఇంటికి విచ్చేసి తమ హీరోకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుకుమార్ అయితే తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.

Pushpa Sukumar (photo-Video Grab)

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డులను (National Awards 2023) కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 69వ జాతీయ అవార్డుల‍్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్నాడు. 2021 సంవత్సరానికి గానూ ‘పుష్ప: ది రైజ్‌’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్‌ (Allu arjun) సొంతం చేసుకున్నారు. తద్వారా 68 ఏళ్ల సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా రికార్డ్ సృష్టించాడు.

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రకటన వెలువడగానే బన్నీ ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది. దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి తదితరులు అల్లు వారి ఇంటికి విచ్చేసి తమ హీరోకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుకుమార్ అయితే తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. అల్లు అర్జున్ ను గట్టిగా హత్తుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇరువురి ఆత్మీయత అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. అందరూ కరతాళ ధ్వనులతో అల్లు అర్జున్, సుకుమార్ ద్వయాన్ని అభినందించారు. బన్నీ తండ్రి అల్లు అరవింద్, అర్ధాంగి స్నేహ కూడా ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు.

Pushpa Sukumar (photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now