The Warrior Update: మరోసారి విలన్‌గా ఆది విశ్వరూపం, ది వారియర్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన మూవీ మేకర్స్, గడ్డంతో రగ్గుడ్ లుక్‌లో క్రూరంగా కనిపిస్తున్న ఆది పినిశెట్టి
ప్రస్తుతం ఈయన రామ్‌పోతినేని హీరోగా నటిస్తున్న ‘ది వారియర్’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని ఆది పినిశెట్టి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ది వారియర్’ చిత్రంలో ఆది గురు పాత్రలో నటించనున్నాడు.
ప్రముఖ దిగ్గజ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన ఆది పినిశెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఈయన రామ్‌పోతినేని హీరోగా నటిస్తున్న ‘ది వారియర్’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని ఆది పినిశెట్టి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ది వారియర్’ చిత్రంలో ఆది గురు పాత్రలో నటించనున్నాడు.
మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో ఆది గడ్డంతో రగ్గుడ్ లుక్‌లో క్రూరంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆర్జే విజిల్ పాత్రలో కృతి శెట్టి నటిస్తుంది. ఇదివరకే విడుదలైన కృతిశెట్టి ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు విశేష స్పందన లభించింది. రామ్ ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. తెలుగు,తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కతుంది.