Acharya Trailer: నేనొచ్చాన‌ని చెప్పాల‌నుకున్నా..కానీ చేయ‌డం మొద‌లుపెడితే, దుమ్మురేపుతున్న కొరటాల శివ ఆచార్య ట్రైలర్, పోటీ పడి నటించిన చిరంజీవి, రాం చరణ్

క్క‌డ అంద‌రూ సౌమ్యులు..పూజ‌లు, పుర‌స్క‌రాలు చేసుకుంటూ..క‌ష్టాలొచ్చిన‌పుడు అమ్మోరు త‌ల్లి మీద భార‌మేసి..బిక్కుబిక్కుమ‌ని ఉంటామేమోన‌ని పొర‌బ‌డి ఉండొచ్చు..ఆప‌దొస్తే ఆ అమ్మోరు త‌ల్లే మాలో ఆవ‌హించి ముందుకు పంపుద్ది ’ అంటూ రాంచ‌ర‌ణ్ డైలాగ్స్ తో షురూ అయింది ట్రైల‌ర్.

Image: Twitter

టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య‌ ట్రైలర్ విడుదలైంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో రాంచ‌ర‌ణ్ కీ రోల్ పోషిస్తున్నాడు. ‘ఇక్క‌డ అంద‌రూ సౌమ్యులు..పూజ‌లు, పుర‌స్క‌రాలు చేసుకుంటూ..క‌ష్టాలొచ్చిన‌పుడు అమ్మోరు త‌ల్లి మీద భార‌మేసి..బిక్కుబిక్కుమ‌ని ఉంటామేమోన‌ని పొర‌బ‌డి ఉండొచ్చు..ఆప‌దొస్తే ఆ అమ్మోరు త‌ల్లే మాలో ఆవ‌హించి ముందుకు పంపుద్ది ’ అంటూ రాంచ‌ర‌ణ్ డైలాగ్స్ తో షురూ అయింది ట్రైల‌ర్.

ఆ త‌ర్వాత యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ధ‌ర్మ‌స్థ‌లి అధ‌ర్మ‌స్థ‌లి ఎలా అవుత‌ది అంటూ చ‌ర‌ణ్ చెప్పే డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. పాద‌ఘ‌ట్టం వాళ్ల గుండెల మీద కాలేస్తే ఆ కాలు తీసేయాల‌ట‌..కాక‌పోతే అది ఏ కాలా..?..నేనొచ్చాన‌ని చెప్పాల‌నుకున్నా..కానీ చేయ‌డం మొద‌లుపెడితే’ అని విల‌న్ తో చిరు చెప్తున్న త‌నదైన స్టైల్ డైలాగ్స్ ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెంచేలా క‌నిపిస్తున్నాయి. కామ్రేడ్స్ గెట‌ప్స్ లో చిరంజీవి, రాంచ‌ర‌ణ్ మ‌ధ్య వ‌చ్చే క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలువ‌బోతున్నాయ‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఏప్రిల్ 29న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది ఆచార్య‌.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif