
Hyderabad, Feb 24: చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు (India Vs Pakistan Match) మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా. అందుకే ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ జట్లు ఆడుతుంటే చూసేందుకు ప్రముఖులంతా దుబాయ్ తరలి వెళ్లారు. వారిలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా ఉన్నారు. ఆయన వీఐపీ గ్యాలరీలో టీమిండియా ఫ్యూచర్ స్టార్లు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ తో కలిసి కూర్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
దుబాయ్లో #MegaStar చిరంజీవి హంగామా మామూలుగా లేదుగా 😍
దగ్గరుండి టీం ఇండియాను గెలిపించెయ్యండి బాస్ 🤩
చూడండి | Champions Trophy | India vs Pakistan లైవ్
మీ 📺 #StarSportsTelugu లో#ChampionsTrophyOnJioStar #ChampionsTrophy2025 #GreatestRivalry pic.twitter.com/EStgoEOgbE
— StarSportsTelugu (@StarSportsTel) February 23, 2025
గెలుపు ఇలా..
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఆదివారం నీటి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. విరాట్ కోహ్లీ (100 నాటౌట్; 111 బంతుల్లో 7 ఫోర్లు) శతకంతో చెలరేగడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగు అయ్యాయి. పాకిస్తాన్ టోర్నీ నుంచి దాదాపుగా నిష్ర్కమించింది. శ్రేయస్ అయ్యర్ (56; 67 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. శుభ్‌మన్ గిల్ (46; 52 బంతుల్లో 7 ఫోర్లు) రాణించాడు. రోహిత్ శర్మ (20) ఫర్వాలేదనిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, షాహీన్ అఫ్రిది, ఖుష్‌దిల్ షా లు తలా ఓ వికెట్ సాధించారు.