Actor Ali Gets Notices: ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ సినీనటుడు అలీకి నోటీసులు, నిర్మాణాలు ఆపివేయాలని సూచన

వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ అలీ పనివారికి నోటీసులు అందజేశారు. గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అలీ తన ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. అందుకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Actor Ali sensational comments on Deputy CM Pawan Kalyan

ప్రముఖ సినీ నటుడు అలీకి అక్రమ నిర్మాణం వ్యవహారం నోటీసులు జారీ అయ్యాయి. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ అలీ పనివారికి నోటీసులు అందజేశారు. గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అలీ తన ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. అందుకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి ఆయనకు నోటీసులు ఇచ్చారు. నిర్మాణాలు ఆపివేయాలని సూచించారు.ఎక్‌మామిడి రెవెన్యూ పరిధి సర్వే నెంబరు 345లోని ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలకు సంబంధించి పత్రాలను సమర్పించి అనుమతులు పొందాలంటూ గతంలోనే అలీకి నోటీసులు జారీ చేశారు. ఆయన స్పందించకపోవడంతో తాజాగా మళ్లీ రెండోసారి పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు.

Actor Ali gets notices for illegal constructions

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

Ashwini Vaishnaw Reaction on Allu Arjun arrest: అల్లు అర్జున్ అరెస్ట్ ను త‌ప్పుబ‌ట్టిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్, క్రియేటివ్ ఇండ‌స్ట్రీపై గౌర‌వం లేదా? అంటూ ప్ర‌శ్న‌

Allu Arjun Gets Interim Bail: అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో సాగిన వాదనలు ఇవే, మధ్యంతర బెయిల్ విషయంలో అర్నాబ్‌ గోస్వామి కేసును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం