Lakshmi Manchu Covid: మంచు లక్ష్మికి కరోనా, రెండేళ్లు తప్పించుకున్నా..చివరకు బుక్కయ్యానంటూ ట్వీట్, టైమ్‌ పాస్‌ కోసం టాప్‌ 3 మూవీస్‌ చెప్పాలంటూ వినతి

మంచు లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘బూచోడు లాంటి కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్నాను. కానీ చివరికి దానికి బారిన పడకతప్పలేదు. దాంతో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ దానికి వేరే ప్లాన్‌ ఉంటుంది కదా.

Lakshmi Manchu (Photo-Twitter)

మంచు లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘బూచోడు లాంటి కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్నాను. కానీ చివరికి దానికి బారిన పడకతప్పలేదు. దాంతో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ దానికి వేరే ప్లాన్‌ ఉంటుంది కదా. అందుకే నన్ను విడిచిపెట్టలేదు. కరోనాకు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాను. నాకు ఉన్న కలరీ స్కిల్స్‌తో నానుంచి దాన్ని ఎలాగైనా పంపించేస్తా. అందరూ ఇంట్లో సేఫ్‌గా ఉండండి. మాస్కులు కచ్చితంగా ధరించండి. వాక్సిన్‌ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు సా​ర్లు టీకా తీసుకొనిఉంటే.. బూస్టర్‌ కూడా తీసుకునేందుకు ప్రయత్నించండి’ అని మంచు లక్ష్మీ వరుస ట్వీట్స్‌ చేసింది. అలాగే టైమ్‌ పాస్‌ కోసం టాప్‌ 3 మూవీస్‌, షోలు, పాడ్‌కాస్ట్‌లు ఉంటే చెప్పండంటూ అభిమానులను కోరింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement