Actress Meena Covid: నటి మీనా కుటుంబం మొత్తానికి కరోనా, ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ట్వీట్

కొత్త సంవత్సరంలో ఊహించని రీతిలో సీనియర్‌ నటి మీనా తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా షాకిచ్చారు. ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి

Actress Meena (Photo/Twitter/meena)

కొత్త సంవత్సరంలో ఊహించని రీతిలో సీనియర్‌ నటి మీనా తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా షాకిచ్చారు. ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బాధ్యతగా మసలుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకు కూడా చోటివ్వండి’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. మీనా కుటుంబం మొత్తానికి కరోనా సోకడంతో ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘దీంతో మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. గెట్‌వెల్‌ సూన్‌ మేడం’ అంటూ ఆమె ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా మీనా చివరిగా దృశ్యం 2లో కనిపించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now