Actress Rambha Health Update: రోడ్డు ప్రమాదానికి గురైన నటి రంభ, ఆమె పిల్లలు, అందరూ బాగానే ఉన్నామంటూ ట్వీట్, కూతురు సాషాకు చిన్న గాయాలయ్యాయని వెల్లడి

ఈ ప్రమాదంలో పెద్దగా ఎవరికి గాయలు కాలేదని, ఆమె కూతురు సాషాకు చిన్నపాటి గాయలకారణంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు రంభ ట్వీట్‌ చేస్తూ.. ప్రమాదానికి గురైన కారు ఫొటోలు, ఆస్పత్రిలో చేరిన చిన్నారి ఫొటోలను పంచుకుంది.

Actress Rambha Health Update (Photo-Twitter)

సీనియర్ హీరోయిన్, నటి రంభ ప్రయాణిస్తున్న కారు మంగళవారం ప్రమాదానికి గురి అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా రంభ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. దీంతో ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో పెద్దగా ఎవరికి గాయలు కాలేదని, ఆమె కూతురు సాషాకు చిన్నపాటి గాయలకారణంగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు రంభ ట్వీట్‌ చేస్తూ.. ప్రమాదానికి గురైన కారు ఫొటోలు, ఆస్పత్రిలో చేరిన చిన్నారి ఫొటోలను పంచుకుంది.

పిల్లలను స్కూల్ నుంచి తీసుకు వస్తుండగా... ఇంటర్ సెక్షన్ దగ్గర మా కారును మరో కారు ఢీ కొట్టింది. అప్పుడు కారులో నాతో పాటు పిల్లలు, ఆయా ఉన్నారు. చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మేమంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. చిన్నారి సాషా ఇంకా ఆసుపత్రిలో ఉంది. బ్యాడ్ టైమ్ నడుస్తోంది. మా కోసం దేవుడిని ప్రార్థించండి. చిన్నారి త్వరగా కోలుకోవాలని కోరుకోండి. మీ ప్రార్థనలు మాకు ఎంతో అవసరం’ అంటూ ఆమె పోస్ట్‌ చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now