Jai Hanuman: ‘జై హనుమాన్’కు స్క్రిప్ట్ సిద్ధమైందన్న ప్రశాంత్‌వర్మ.. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా హనుమంతుడి విగ్రహం ముందు సీక్వెల్ స్క్రిప్ట్ ను ఉంచిన డైరెక్టర్
తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ చిత్రం ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. తొలి భాగం ముగింపులోనే ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’ గురించి హింట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ.
Hyderabad, Jan 23: యువ నటుడు తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-Man) చిత్రం ఇటీవలే విడుదలై సర్వత్రా ప్రశంసలు అందుకొంది. తొలి భాగం ముగింపులోనే ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’ గురించి హింట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. తాజాగా ‘జై హనుమాన్’కు (Jai Hanuman) స్క్రిప్ట్ సిద్ధమైందని ఆయన తెలిపారు. అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హైదరాబాద్ లోని ఓ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన యాగంలో పాల్గొని సీక్వెల్ స్క్రిప్ట్ ను హనుమంతుడి విగ్రహం ముందు ఉంచారు. ప్రీ ప్రొడక్షన్ ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సందర్భం తనకు లభించదని అన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)