Aishwarya-Abhishek Separation Rumours: విడాకుల రూమర్స్‌ కు ఒక్క వీడియోతో చెక్‌ పెట్టిన ఐశ్వర్యరాయ్‌ (వీడియోతో)

దాదాపు 17 ఏండ్ల సుదీర్ఘ వైవాహిక బంధంలో వీరి మధ్య విభేదాలు తలెత్తిన దాఖలాలు లేవు.

Aishwarya (Credits: Insta)

Newdelhi, Dec 17: బాలీవుడ్‌ లో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek)-ఐశ్వర్యరాయ్‌ (Aishwarya). దాదాపు 17 ఏండ్ల సుదీర్ఘ వైవాహిక బంధంలో వీరి మధ్య విభేదాలు తలెత్తిన దాఖలాలు లేవు. అయితే ఈ జంట విడిపోనున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో (Social Media) వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ రూమర్స్‌ అన్నింటికి తన తాజా వీడియోతో చెక్‌ పెట్టింది ఐశ్వర్యరాయ్‌. ముంబయిలో జరిగిన ఓ స్కూల్‌ వార్షికోత్సవ వేడుకలో అమితాబ్‌బచ్చన్‌, అభిషేక్‌, ఐశ్వర్యరాయ్‌ కలిసి పాల్గొన్నారు. ముగ్గురూ సరదాగా నవ్వుతూ కనిపించారు. ఇదే ఈవెంట్‌ లో అమితాబ్‌బచ్చన్‌ ఫ్యామిలీ అంతా కలిసి స్టేజీ మీద నృత్యం చేశారు. దీంతో విడాకుల రూమర్స్‌కు చెక్‌ పడినట్లయిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Pallavi Prashanth As Bigg Boss 7 Telugu winner: బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, రన్నరప్ గా అమర్ దీప్..

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)