Mumbai, FEB 02: ఇంగ్లండ్, టీం ఇండియా మధ్య ముంబైలో (India Vs England) జరుగుతున్న ఐదవ, చివరి టీ-20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) శతకం పూర్తి చేశాడు. టాస్ గెలుచుకున్న ఇంగ్లండ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. 10.1 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఐదు ఫోర్లు, పది సిక్సర్లతో సెంచరీ (Abhishek Sharma Century) పూర్తి చేసుకున్నాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ 16 పరుగులు చేసి వుడ్ బౌలింగ్‌లో ఆర్చర్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత వచ్చిన తిలక్ వర్మ, సారధి సూర్య కుమార్ యాదవ్ ఔటయ్యారు. తిలక్ వర్మ 24 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ రెండు పరుగులు చేశారు. తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ కార్స్ బౌలింగ్‌లోనే సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టారు.
టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో అభిషేక్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో అతడికి ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో అతడు సంజూ శాంసన్ రికార్డును బ్రేక్ చేశాడు. 2024లో శాంసన్ 40 బంతుల్లో బంగ్లాదేశ్ పై సెంచరీ చేశాడు. కాగా.. 2017లో శ్రీలంక పై 35 బంతుల్లో రోహిత్ శర్మ సెంచరీ చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
Another Feat For Abhishek Sharma
End of an explosive 135-run knock from Abhishek Sharma 👏👏
He finishes with 1⃣3⃣ sixes - the most ever for an Indian batter in T20Is in Men's Cricket 🙌
Live ▶️ https://t.co/B13UlBNdFP#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/Jb9Le56aBX
— BCCI (@BCCI) February 2, 2025
టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
రోహిత్ శర్మ – శ్రీలంక పై 35 బంతుల్లో (2017)
అబిషేక్ శర్మ – ఇంగ్లాండ్ పై 37 బంతుల్లో (2025)
సంజూ శాంసన్ – బంగ్లాదేశ్ పై (2024)
ఇక ఓవరాల్‌గా తీసుకుంటే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా అభిషేక్ రికార్డుకు ఎక్కాడు. ఈ జాబితాలో డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ లు సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాళ్లు..
డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) – బంగ్లాదేశ్ పై 35 బంతుల్లో (2017)
రోహిత్ శర్మ (భారత్) – శ్రీలంక పై 35 బంతుల్లో (2017)
అబిషేక్ శర్మ (భారత్) – ఇంగ్లాండ్ పై 37 బంతుల్లో (2025)
జాన్సన్ చార్లెస్ (వెస్టీండీస్) – దక్షిణాఫికా పై (2023)
సంజూ శాంసన్ (భారత్) – బంగ్లాదేశ్ పై (2024)