ANR Birth Anniversary: అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు, ఎమోషనల్ వీడియోను ట్వీట్ చేసిన అక్కినేని నాగార్జున, నాన్నకు పంచె అంటే ఎంతో ఇష్టమని తెలిపిన మన్మథుడు
తెలుగు చిత్ర సీమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన నటవారడు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తన తండ్రికి ట్విటర్ ద్వారానివాళులర్పించారు. ఆయనే తన హీరో, స్పూర్తి అంటూ ఒక వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు
తెలుగు చిత్ర సీమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన నటవారడు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తన తండ్రికి ట్విటర్ ద్వారానివాళులర్పించారు. ఆయనే తన హీరో, స్పూర్తి అంటూ ఒక వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఆయనకు పంచె అంటే ఎంతో ఇష్టమని, ముఖ్యంగా పొందూరు ఖద్దరుఅంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఆయన పంచె కట్టు అందాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకే అంటూ తన అప్‌కమింగ్ మూవీ బంగార్రాజు లుక్‌ను జోడించారు. కాగా నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్‌గా 'బంగార్రాజు' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటు యంగ్ హీరో నాగ చైతన్య కూడా అలరించనున్నారు. నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణ, నాగ చైతన్య సరసన ఉప్పెన ఫేం బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)