Pushpa Pushpa First Single: పుష్ప పుష్ప లిరికల్ సాంగ్ విడుదల రేపే, సాయంత్రం 5.04 గంటలకు తొలి పాట విడుదల చేయనున్న మేకర్స్

రేపు (మే 1) సాయంత్రం 5.04 గంటలకు పుష్ప-2 చిత్రం నుంచి పుష్ప పుష్ప అనే గీతం విడుదల చేయనున్నట్టు చిత్రబృందం నేడు అనౌన్స్ చేసింది. ఈ మేరకు పాటలో అల్లు అర్జున్ లుక్ ను కూడా పంచుకుంది

Pushpa Pushpa First Single

అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప-2 నుంచి తొలి సింగిల్  విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు (మే 1) సాయంత్రం 5.04 గంటలకు పుష్ప-2 చిత్రం నుంచి పుష్ప పుష్ప అనే గీతం విడుదల చేయనున్నట్టు చిత్రబృందం నేడు అనౌన్స్ చేసింది. ఈ మేరకు పాటలో అల్లు అర్జున్ లుక్ ను కూడా పంచుకుంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రేపు విడుదలయ్యే లిరికల్ వీడియో కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప: ది రైజ్ చిత్రంకు సీక్వెల్ గా  పుష్ప: ది రూలర్ వస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇందులో కూడా రష్మిక మందనే కథానాయిక.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)