Acharya: ఆచార్యకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్, విడుద‌లైన‌ ప‌ది రోజుల వ‌ర‌కు రూ.50 టికెట్ ధర పెంచుకునేందుకు అంగీకారం, ఐదో షో విషయంలో ఇంకా రాని స్పష్టత

మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్‌ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను ఆ సినిమా విడుద‌లైన‌ ప‌ది రోజుల వ‌ర‌కు రూ.50 పెంచుకునేందుకు ఏపీ స‌ర్కారు అంగీకరించింది. ఐదో షో విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణ‌య‌మూ తీసుకోలేద‌ని తెలుస్తోంది.

Image: Twitter

మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్‌ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను ఆ సినిమా విడుద‌లైన‌ ప‌ది రోజుల వ‌ర‌కు రూ.50 పెంచుకునేందుకు ఏపీ స‌ర్కారు అంగీకరించింది. ఐదో షో విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణ‌య‌మూ తీసుకోలేద‌ని తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి ఐదో ఆట‌కు అనుమ‌తి ఇస్తూ, టికెట్ ధ‌ర‌లు ఏడు రోజుల వ‌ర‌కు పెంచుకునే అవ‌కాశం ఇస్తూ తెలంగాణ స‌ర్కారు కూడా ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా, ఏపీ ప్రభుత్వం భారీ బడ్జెట్‌ చిత్రాలకు తొలి పది రోజుల పాటు టికెట్ ధ‌ర‌లు పెంచుకునేందుకు అవ‌కాశాలు క‌ల్పిస్తోంది. కొర‌టాల శివ‌ వంటి స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ చిరంజీవితో రూపొందించిన ‘ఆచార్య’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

AP government agreed to increase ticket prices for 'Acharya' by Rs 50 within ten days of the film's release

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now