Raj Kundra Released: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్‌కుంద్రా జైలు నుంచి రిలీజ్, బెయిల్ మంజూరీ చేసిన ముంబై కోర్టు
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇవాళ ముంబైలోని ఆర్ధర్ రోడ్డు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. పోర్నోగ్రఫీ కేసులో నిన్న ముంబై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అశ్లీల వీడియోలను షూట్ చేసి.. ఓ యాప్ ద్వారా వాటిని అప్‌లోడ్ చేసినట్లు రాజ్‌కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి.
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఇవాళ ముంబైలోని ఆర్ధర్ రోడ్డు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. పోర్నోగ్రఫీ కేసులో నిన్న ముంబై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అశ్లీల వీడియోలను షూట్ చేసి.. ఓ యాప్ ద్వారా వాటిని అప్‌లోడ్ చేసినట్లు రాజ్‌కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ ఉదయం 11.30 నిమిషాలకు రాజ్‌కుంద్రా జైలు నుంచి బయటకు వచ్చారు. రెండు నెలల క్రితం ఆయన అరెస్టు అయ్యారు. 50వేల పూచీకత్తుపై మెజిస్ట్రేట్ భాజిపాలే ఆయనకు బెయిల్ మంజూరీ చేశారు. కుంద్రాతో పాటు అరెస్టు అయిన ర్యాన్ థోర్ప్‌కు కూడా బెయిల్ ఇచ్చారు. సెంట్రల్ ముంబైలో ఉన్న ఆర్డర్ రోడ్డు జైలులో రాజ్‌కుంద్రాను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. హాట్‌స్పాట్స్ అనే యాప్ ద్వారా అశ్లీల చిత్రాలను అప్‌లోడ్ చేసినట్లు కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి. అయితే తానేమీ పోర్న్ కాంటెంట్‌ను క్రియేట్ చేయలేదని కుంద్రా తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)