RGV Dance in Pub: అమ్మాయిలతో పబ్‌లో చిందేసిన వర్మ, ఇద్దరు అమ్మాయిలను పట్టుకుని మరీ డ్యాన్స్ వేసిన వీడియో వైరల్

ఆదివారం రాత్రి ఆయన నగరంలోని ప్రిజమ్ పబ్ కు వెళ్లారు. పబ్ లో సంగీతానికి ఆయన స్టెప్పులు వేశారు. ఇద్దరు అమ్మాయిలను పట్టుకుని మరీ ఆయన డ్యాన్స్ చేశారు. ఈ వ్యవహారానికి సంబందించిన వీడియోను ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు

Varma

రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనంగానే మారుతోంది. హైదరాబాద్ లో పబ్ లలో రాత్రి 10 గంటలు దాటితే మ్యూజిక్ బంద్ చేయాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్పందించిన వర్మ... అసలు వరల్డ్ క్లాస్ సిటీగా మారిన హైదరాబాద్ లో ఈ తరహా ఆంక్షలేమిటని ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం రాత్రి ఆయన నగరంలోని ప్రిజమ్ పబ్ కు వెళ్లారు. పబ్ లో సంగీతానికి ఆయన స్టెప్పులు వేశారు. ఇద్దరు అమ్మాయిలను పట్టుకుని మరీ ఆయన డ్యాన్స్ చేశారు. ఈ వ్యవహారానికి సంబందించిన వీడియోను ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ప్రిజమ్ పబ్ పన్ లో తాను పాలుపంచుకున్నానంటూ ఆ వీడియోకు ఆయన ఓ కామెంట్ ను జత చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now