Varma on KCR BRS Party: కేసీఆర్‌ తొలి ఆదిపురుష్‌, సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ, జాతీయ రాజకీయాల్లో రావడాన్ని స్వాగతిస్తున్నానంటూ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి టీఆర్‌ఎస్‌ పేరు కనుమరుగు కానుంది. 2001 జలదృశ్యం సభలో టీఆర్‌ఎస్‌ అవతరించింది.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి టీఆర్‌ఎస్‌ పేరు కనుమరుగు కానుంది. 2001 జలదృశ్యం సభలో టీఆర్‌ఎస్‌ అవతరించింది. మళ్లీ 21 ఏళ్ల తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ.. బీఆర్‌ఎస్‌గా మార్పు చెందుతూ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ ప్ర‌క‌టించిన వెంటనే సోష‌ల్ మీడియా వేదిక‌గా వ‌ర్మ స్పందించారు. ‘కేసీఆర్‌ ఆది పురుష్‌’ అంటూ సంచలన ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రావడాన్ని స్వాగతిస్తున్నా.. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్‌ తొలి ఆదిపురుష్‌ అయ్యాడంటూ ఆయన ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now