Thunivu, Varisu Release: తమిళనాడులో సినిమా పండుగ, ఒకేరోజు విజయ్, అజిత్ సినిమాలు రిలీజ్, థియేటర్ల ముందు డ్యాన్సులతో హోరెత్తిస్తున్న ఫ్యాన్స్
ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తునివు(Thunivu ), విజయ్ (Vijay) నటించిన వారిసు (Varisu) సినిమా ఇవాళ రిలీజ్ అయ్యాయి. దీంతో థియేటర్ల ముందు ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి.
Madurai, JAN 11: తమిళనాడు సినిమా ఫ్యాన్స్‌కు పండుగ ముందే వచ్చింది. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన తునివు (Thunivu), విజయ్ (Vijay) నటించిన వారిసు (Varisu) సినిమా ఇవాళ రిలీజ్ అయ్యాయి. దీంతో థియేటర్ల ముందు ఫ్యాన్స్ కోలాహలం నెలకొంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. అయితే విజయ్ సినిమా కంటే అజిత్ సినిమా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ రెండు మూవీస్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే సినిమా హాళ్ల ఎదుట ఫ్యాన్స్ హంగామా మొదలైంది. డప్పులు కొడుతూ, టపాసులు కాల్చుతూ సంబురాలు చేసుకుంటున్నారు. మధురైతో పాటూ, చెన్నై ఇతర ప్రధాన నగరాల్లో మల్టీప్లెక్స్ ల ముందు వేలాదిగా ఫ్యాన్స్ డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)