Check Bounce Case: చెక్ బౌన్స్ కేసు, బండ్లగణేశ్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షలు జరిమానా విధించిన ఒంగోలు కోర్టు
టాలీవుడ్ నిర్మాత బండ్లగణేశ్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షలు జరిమానా విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు సంచలన తీర్పును వెలువరించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు.
టాలీవుడ్ నిర్మాత బండ్లగణేశ్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షలు జరిమానా విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు సంచలన తీర్పును వెలువరించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేశ్ రూ. 95 లక్షల అప్పు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణాంతరం ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షల చెక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకి రామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
ఇదిలా ఉంటే గతంలో 2017లో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది.టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)