Bhimaa Teaser Released: గోపీచంద్‌ భీమా ట్రైలర్ ఇదిగో, ఎద్దుపై కూర్చొని సంకెళ్లతో పాటు ఖాకీ దుస్తుల్లో అదరహో అనిపిస్తున్న గోపీచంద్

కేకే రాధామోహన్‌ నిర్మాత. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ కథానాయికలు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.ఈ చిత్రంలో గోపీచంద్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు.

Gopichand's Bhimaa Movie Teaser Released

గోపీచంద్‌ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వంలో వస్తున్న మూవీ భీమా. కేకే రాధామోహన్‌ నిర్మాత. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ కథానాయికలు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.ఈ చిత్రంలో గోపీచంద్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించనున్నారు. టీజర్ లో గోపీచంద్‌ ఒక ఎద్దుపై కూర్చొని సంకెళ్లతో పాటు ఖాకీ దుస్తుల్లో కనిపించాడు. వినూత్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా గోపీ కెరియర్‌లో 31వ చిత్రంగా భీమా తెరకెక్కుతుంది. ఫిబ్రవరి 16న భీమా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇది గోపీ కెరియర్‌లో 31వ సినిమా కాగా శ్రీనువైట్ల డైరెక్షన్‌లో తన 32 వ సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది.

Here's Teaser

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)