Grammys 2024: గ్రామీ అవార్డుల్లో కొత్త రికార్డు సృష్టించిన పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్, బెస్ట్ ఆల్బమ్ క్యాటగిరీలో వరుసగా 4 సార్లు అవార్డు అందుకున్న తొలి సింగర్‌గా కొత్త చరిత్ర
బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఆమె నాలుగోసారి కైవసం చేసుకున్నది.మిడ్‌నైట్స్ అన్న ఆల్బమ్‌కు ఆ అవార్డు దక్కింది. బెస్ట్ ఆల్బమ్ క్యాటగిరీలో నాలుగుసార్లు అవార్డు గెలిచిన తొలి సింగర్‌గా ఆమె నిలిచింది.
పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్(Taylor Swift) గ్రామీ మ్యూజిక్ అవార్డుల్లో మరోసారి సత్తా చాటింది. బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఆమె నాలుగోసారి కైవసం చేసుకున్నది.మిడ్‌నైట్స్ అన్న ఆల్బమ్‌కు ఆ అవార్డు దక్కింది. బెస్ట్ ఆల్బమ్ క్యాటగిరీలో నాలుగుసార్లు అవార్డు గెలిచిన తొలి సింగర్‌గా ఆమె నిలిచింది. మూడుసార్లు బెస్ట్ ఆల్బమ్ గెలిచిన సింగర్లలో స్టీవ్ వండర్, పౌల్ సిమన్, ఫ్రాంక్ సినత్రాలు ఉన్నారు. మిడ్‌నైట్స్ ఆల్బమ్ టేలర్ యొక్క 10వ ఆల్బమ్. ఇదిలా ఉంటే గ్రామీ పురస్కారాల వేళ టేలర్ స్విఫ్ట్ తన 11వ స్టూడియో ఆల్బమ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 19వ తేదీన కొత్త ఆల్బమ్ రిలీజ్ అవుతోందని, ద టార్చర్డ్ పోయెట్స్ డిపార్ట్‌మెంట్ అన్న పేరుతో ఆ ఆల్బమ్ రిలీజ్ చేయనున్నట్లు ఆమె చెప్పారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)