Dhanush Tweet on Jailer: భార్యకు దూరంగా ఉన్నా మామ మీద ప్రేమను మరోసారి చాటుకున్న ధనుష్, ఇట్స్‌ జైలర్‌ వీక్‌ అంటూ ట్విట్టర్లో ట్వీట్

రజనీకాంత్ కొత్త సినిమా జైలర్ గురించి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇట్స్‌ జైలర్‌ వీక్‌ (ఇది జైలర్‌ వారం) అంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ధనుష్‌ అభిమానులు తాను ముందు రజనీకాంత్‌ అభిమాని అని.. ఆ తర్వాతే అన్నీ అని ధనుష్‌ మరోసారి నిరూపించారని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు

Rajinikanth and Dhanush (Photo-Twitter)

కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్‌.. రజనీకాంత్ కొత్త సినిమా జైలర్ గురించి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇట్స్‌ జైలర్‌ వీక్‌ (ఇది జైలర్‌ వారం) అంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ధనుష్‌ అభిమానులు తాను ముందు రజనీకాంత్‌ అభిమాని అని.. ఆ తర్వాతే అన్నీ అని ధనుష్‌ మరోసారి నిరూపించారని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా తాను రజనీకాంత్‌ వీరాభిమానినని గతంలో చాలాసార్లు బహిరంగంగానే చెప్పిన సంగతి తెలిసిందే.

రజనీకాంత్‌ పెద్ద కూతురు ఐశ్వర్యను ధనుష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈ జంటకు ఇద్దరు కూమారులు. ధనుశ్, ఐశ్వర్య మనస్వర్థల కారణంగా విడిపోయి అందరికి ఊహించని షాక్‌ ఇచ్చారు. అప్పటి నుంచి చాలాకాలంగా రజనీకాంత్‌ కుటుంబానికి దూరంగా ఉంటున్న ధనుష్‌.. తాజాగా చేసిన ట్వీట్‌తో ఒక్కసారిగా వార్తల్లోకి నిలిచారు.ఇక నెల్సన్‌ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న జైలర్ నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Rajinikanth and Dhanush (Photo-Twitter)

Here's Dhanush Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)