Mohan Babu: కొవిడ్ వాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న మోహన్ బాబు, అందరూ వ్యాక్సిన్ తీసుకోండి, ఇంటి నుంచి బయటకు వెళ్తే కచ్చితంగా మాస్కులు ధరించండి అంటూ ట్వీట్
ఇటీవల తిరుపతిలో మొదటి డోస్ తీసుకున్న కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తాజాగా రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేశారు. ‘రెండో డోస్ వ్యాక్సిన్ పూర్తయింది.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసేది ఒక్కటే.. అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్తే కచ్చితంగా మాస్కులు ధరించండి’అని మోహన్ బాబు ట్వీట్ చేశారు. కాగా, మోహన్ బాబు ప్రస్తుతం సన్నాఫ్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)