Nagarjuna on Konda Surekha Comments: నాగచైతన్య-సమంత విడాకులు, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో నాగార్జున, మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ.. నాగచైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ.. నాగచైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే నటీనటుల జీవితాలను ప్రత్యర్థులపై విమర్శించేందుకు వాడుకోవద్దని సూచించారు.
ఆయన ట్వీట్ చేస్తూ.. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నానని తెలిపారు.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)