Prabhas Wax Statue: ప్రభాస్ మైనపు విగ్రహంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, విగ్రహాన్ని తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపడతామని తెలిపిన బాహుబలి నిర్మాత

బాహుబలి స్టార్ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని మైసూర్‌లోని ఓ స్టేడియంలో ఏర్పాటు చేశారు. బాహుబలి గెటప్‌లో ఉన్న ప్రభాస్‌ మైనపు విగ్రహంకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు.మాకు కనీస సమాచారం అందించకుండా, మా అనుమతులు తీసుకోకుండా ఈ విగ్రహాన్ని తయారు చేశారు.

Prabhas Wax Statue and Shobu Yarlagadda (Photo-X)

బాహుబలి స్టార్ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని మైసూర్‌లోని ఓ స్టేడియంలో ఏర్పాటు చేశారు. బాహుబలి గెటప్‌లో ఉన్న ప్రభాస్‌ మైనపు విగ్రహంకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు.మాకు కనీస సమాచారం అందించకుండా, మా అనుమతులు తీసుకోకుండా ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపడతాం' అని నిర్మాత ట్వీట్‌ చేశాడు.

ఇది చూసిన నెటిజన్లు.. 'హమ్మయ్య, మీరు చెప్పాక కానీ ఆయన ప్రభాస్‌ అని మాకు అర్థం కాలేదు, థాంక్యూ..' అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరికొందరేమో.. 'దేశం మొత్తం మీద ఎక్కడ బాహుబలి బొమ్మలు ఉన్నా అన్నీ లైసెన్స్‌ తీసుకునే చేస్తున్నారా? ఆ విగ్రహాల వెనక పరిగెత్తే బదులు లైట్‌ తీసుకోవచ్చుగా' అని ఉచిత సలహా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల మైనపు బొమ్మలను ఏర్పాటు చేసే మేడమ్‌ టుస్సాడ్స్‌లో కూడా 2017లోనే ప్రభాస్‌ మైనపు విగ్రహం తయారు చేసిన సంగతి విదితమే.

Prabhas Wax Statue and Shobu Yarlagadda (Photo-X)

Here's Shobu Yarlagadda Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement