Vijay Deverakonda: పాపులర్ అవుతున్నప్పుడు ఇలాంటివి మాములే, ఈడీ 12 గంటల విచారణ అనంతరం విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు

లైగర్ సినిమాలో పెట్టుబడులకు సంబంధించి హీరో విజయ్ దేవరకొండను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం సుమారు 12 గంటల పాటు విచారించింది. ఉదయం 8:30 గంటలకు ఈడీ ఆఫీసుకు వచ్చిన విజయ్.. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు

Vijay Deverakonda

లైగర్ సినిమాలో పెట్టుబడులకు సంబంధించి హీరో విజయ్ దేవరకొండను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం సుమారు 12 గంటల పాటు విచారించింది. ఉదయం 8:30 గంటలకు ఈడీ ఆఫీసుకు వచ్చిన విజయ్.. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. విచారణ ముగిసిన తర్వాత ఈడీ ఆఫీసు ముందు హీరో విజయ్ విలేకరులతో మాట్లాడారు. విచారణపై స్పందిస్తూ.. పాప్యులారిటీ పెరుగుతున్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం మామూలే అని వ్యాఖ్యానించారు.

విచారణకు రావాలంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో బుధవారం ఈడీ ఆఫీసుకు వచ్చినట్లు విజయ్ తెలిపారు. బాధ్యతగల పౌరుడిగా అధికారులు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ జవాబిచ్చినట్లు చెప్పారు. తనను మళ్లీ రమ్మని పిలవలేదని స్పష్టం చేశారు. పాప్యులారిటీ పెరుగుతున్నపుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవని విజయ్ దేవరకొండ చెప్పారు. కాగా, విజయ్ హీరోగా నటించిన ‘లైగర్’ సినిమాను రూ.100 కోట్లతో తెరకెక్కించినట్లు నిర్మాతలు గతంలో ప్రకటించారు. ఈ పెట్టుబడులలో మనీలాండరింగ్, హవాలా కోణాలపై ఈడీ దర్యాఫ్తు చేపట్టింది. లైగర్ డైరెక్టర్ పూరీజగన్నాథ్, నిర్మాత ఛార్మీలను ఈడీ అధికారులు ఇప్పటికే విచారించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement