Ram Gopal Varma: త్వరలో వైరస్ ఛానల్ రావొచ్చు, రకరకాల వైరస్‌ల వివరాలు తెలిపేందుకు ఈ ఛానల్ వచ్చే అవకాశం ఉందని ట్విట్టర్లో చమత్కరించిన వర్మ

ప్రపంచంలోనే వివిధ ప్రాంతాల్లో తరచుగా భిన్న రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు చోటుచేసుకుంటున్న తరుణంలో తనకో ఆలోచన వచ్చిందని వెల్లడించారు. ఇప్పటికే వాతావరణ వివరాలు తెలిపేందుకు 'వెదర్ చానల్' ఉందని, ఇప్పుడు రకరకాల వైరస్ ల వివరాలు తెలిపేందుకు త్వరలోనే 'వైరస్ చానల్' కూడా వస్తుందేమోనని చమత్కరించారు.

RGV says, It's pointless to ask brutal punishment for Hyderabad Vet's rapists and murderers (Photo-Twitter)

గత రెండేళ్ల నుంచి యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి ధాటికి ఛిన్నాభిన్నం అయింది. 2019 చివర్లో చైనాలో వెలుగు చూసిన కరోనా పలు విధాలుగా రూపాంతరం చెందుతూ అనేక వేరియంట్లుగా విరుచుకుపడుతోంది. తాజాగా ఒమిక్రాన్ రూపు దాల్చిన కరోనా... అనేక దేశాల్లో శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే వివిధ ప్రాంతాల్లో తరచుగా భిన్న రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు చోటుచేసుకుంటున్న తరుణంలో తనకో ఆలోచన వచ్చిందని వెల్లడించారు. ఇప్పటికే వాతావరణ వివరాలు తెలిపేందుకు 'వెదర్ చానల్' ఉందని, ఇప్పుడు రకరకాల వైరస్ ల వివరాలు తెలిపేందుకు త్వరలోనే 'వైరస్ చానల్' కూడా వస్తుందేమోనని చమత్కరించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement