Ikkis Trailer Out: ఇక్కీస్ ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.. హీరోగా అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా మూవీ
భారత సైన్యంలో అత్యంత వీరోచిత సాహసాలను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం‘ఇక్కీస్’ (Ikkis). ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో దేశభక్తి భావాలను రగిలిస్తోంది.
భారత సైన్యంలో అత్యంత వీరోచిత సాహసాలను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం‘ఇక్కీస్’ (Ikkis). ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో దేశభక్తి భావాలను రగిలిస్తోంది. అంధాధున్ వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీరామ్ రాఘవన్ ఈ యుద్ధ నాటకానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద ఈ చిత్రంలో అరుణ్ ఖేతర్‌పాల్ పాత్రలో నటిస్తున్నాడు. ఆయనతో పాటు ధర్మేంద్ర, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
1971 ఇండో–పాక్ యుద్ధం నేపథ్యంగా సాగే ఈ చిత్రం, కేవలం 21 ఏళ్ల వయసులోనే అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన ఖేతర్‌పాల్ వీరత్వాన్ని చూపిస్తుంది. దేశ రక్షణ కోసం చివరి వరకూ పోరాడిన ఆయన త్యాగానికి గాను మరణానంతరం పరమవీర్ చక్ర అవార్డు లభించింది. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌లో యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు, దేశభక్తి భావం అద్భుతంగా మేళవించబడ్డాయి. అగస్త్య నందా నటన, రాఘవన్ దర్శకత్వం, మరియు శక్తివంతమైన నేపథ్య సంగీతం ఇప్పటికే సినీప్రేమికులలో ఆసక్తి రేపుతున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)