Jani Master: డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారని వార్తలపై స్పందించిన జానీ మాస్టర్, వీడియో ఇదిగో..
జానీ మాస్టర్ ని డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చాయి. ఈ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో.. అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ ను తొలగించారని వార్తలు రాగా దానిపై జానీ మాస్టర్ స్పందించారు.
జానీ మాస్టర్ ని డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చాయి. ఈ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో.. అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ ను తొలగించారని వార్తలు రాగా దానిపై జానీ మాస్టర్ స్పందించారు.ఉదయం నుంచి ఒక ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నన్ను డ్యాన్సర్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఎవరు నమ్మకండి. ఇవి ఫేక్.. నన్ను ఏ అసోసియేషన్ నుంచి తొలగించలేదు. నా కార్డును ఎవరు తీసేయలేదు. నేను ఇప్పటికే డ్యాన్సర్ అసోసియేషన్‌లో సభ్యుడినే. నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకంఉటాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు.’ అని ఆ వీడియో జానీ మాస్టర్ అన్నారు.
Jani Master Clarify Rumour Of His Dance Association Membership Cancellation
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)