Jr NTR Fan Shyam Dies: అభిమాని శ్యామ్ మృతిపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, దీనిపై తక్షణమే దర్యాప్తు జరపాలని పోలీసులకు విజ్ఞప్తి

శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని తారక్ అన్నారు. శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. శ్యామ్ ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

NTR (Photo Credits: Twitter)

కోనసీమ జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన మృతి చెందారు. తన కొడుకుది హత్య అని శ్యామ్ తండ్రి చెపుతుండగా... శ్యామ్ ఉరి వేసుకుని చనిపోయాడని పోలీసులు చెపుతున్నారు. ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని తారక్ అన్నారు. శ్యామ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. శ్యామ్ ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

Junior NTR Statement
Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement