Kamal Haasan Covid: ఐసోలేషన్‌లో కమల్ హాసన్, అమెరికా నుంచి వచ్చిన తరువాత కరోనా బారిన పడిన అగ్ర నటుడు, దయ చేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ట్వీట్
ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్ చేశారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ కరోనా (Kamal Haasan Covid) బారిన పడ్డారు. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్ చేశారు. ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన నాకు కాస్త దగ్గు, జలుబు వచ్చింది. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా (Kamal Haasan Tests Positive For COVID-19) నిర్ధారించబడ్డాను.
ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే... మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. దయ చేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి’ అంటూ కమల్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా ఆయన కొత్తగా అమెరికాలో దుస్తుల వ్యాపారం ప్రారంభిస్తున్నారు. తన బ్రాండ్ క్లాత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కమల్‌హాసన్ అమెరికా వెళ్లారని సమాచారం.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)