Karthik Kumar: నా భర్త గే అంటూ విమర్శలు గుప్పించిన సుచిత్ర, నేను స్వలింగసంపర్కుడిని అయితే చెప్పడానికి నేనేమీ సిగ్గుపడేవాడిని కాదు అంటూ హీరో ఘాటు రిప్లై
నటుడు, కమెడియన్ కార్తీక్ కుమార్ గే అంటూ అతడి మాజీ భార్య, సింగర్ సుచిత్ర తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లయిన 11 ఏళ్లకు అతడి నిజ స్వరూపం తెలిసిందని, అప్పటిదాకా తను గే అని బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడలేదని పేర్కొంది.
నటుడు, కమెడియన్ కార్తీక్ కుమార్ గే అంటూ అతడి మాజీ భార్య, సింగర్ సుచిత్ర తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లయిన 11 ఏళ్లకు అతడి నిజ స్వరూపం తెలిసిందని, అప్పటిదాకా తను గే అని బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడలేదని పేర్కొంది. అమృత అతడిని పెళ్లి చేసుకుని తప్పు చేసిందని తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ వ్యాఖ్యలపై నటుడు కార్తీక్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. పర్మిషన్ లేకుండా తన పేరు వాడుకోవడంపై కోర్టు గడపతొక్కిన బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వివిధ సంస్థలపై దావా
'నేను స్వలింగసంపర్కుడినా? ఒకవేళ అదే అయ్యుంటే మాత్రం బయటకు చెప్పడానికి నేనేమీ సిగ్గుపడేవాడిని కాదు. అది ఏదైనా సరే గర్వంగా చెప్పుకునేవాడిని. అంతేకానీ ముడుచుకుపోను. నా నగరంలో దర్జాగా ర్యాలీ చేసేవాడిని.. అన్నిరకాల వాళ్లు అందులో పాల్గొని వారు అండగా నిలబడేవాళ్లు. ఎవరూ దేనికీ తలదించుకోవాల్సిన అవసరం లేదు. గర్వంగా బతకండి' అంటూ ఓ వీడియో షేర్ చేశాడు.
Here's His Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)