Khaleja Movie Actor Aman Attacked In US: ‘ఖలేజా’ నటుడు అమన్‌పై అమెరికాలో దాడి.. జిమ్‌లో అందరూ చూస్తుండగానే ఘటన.. శరీరంపై పలుచోట్ల కత్తి గాయాలు.. వీడియో వైరల్

గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలి లాంటి ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు.

Aman (Credits: Twitter)

Newyork, March 17: పంజాబీ ప్రముఖ నటుడు, ఖలేజా (Khaleja), జోదా అక్బర్ తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన అమన్ ధలీవాల్‌పై (Aman Dhaliwal) అమెరికాలో దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలి లాంటి ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. కాలిఫోర్నియాలోని ప్లానెట్ ఫిట్‌నెస్ జిమ్‌లో జరిగిన ఈ దాడిలో ఆయన శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. జిమ్‌కు వెళ్లిన ఆయనపై అందరూ చూస్తుండగానే ఈ దాడి జరిగింది.  వెంటనే తేరుకున్న జిమ్ సిబ్బంది గాయపడిన అమన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అమన్‌పై నిందితుడు ఎందుకు దాడిచేశాడన్న విషయంలో క్లారిటీ లేదు. శరీరమంతా కట్లతో ఉన్న ధలీవల్ ఫొటో, నిందితుడు దాడిచేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రానా నాయుడు, బూతు సిరీస్ అంటూనే తెగ చూసేస్తున్న నెటిజన్లు, ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వ్యూస్, ఓటీటీ ఫ్లాట్ ఫాంలో నంబర్ వన్‌‌ ఇదే

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)