Koffee With Karan: విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలంటున్న ఇద్దరు హీరోయిన్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రోమో
విజయ్ దేవరకొండ పేరు అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. తాజాగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ విజయ్ మీద ముందు నుంచి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. తనకు విజయ్ అంటే ఇష్టం అని పలు సందర్భాల్లో జాన్వీ కపూర్ బయట పెట్టింది
విజయ్ దేవరకొండ పేరు అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కింది. తాజాగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ విజయ్ మీద ముందు నుంచి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. తనకు విజయ్ అంటే ఇష్టం అని పలు సందర్భాల్లో జాన్వీ కపూర్ బయట పెట్టింది. ఇప్పుడు తాజాగా తనకు కూడా విజయ్ అంటే ఇష్టం అంటూ ఆమె స్నేహితురాలు మరో స్టార్ డాటర్ అయిన సారా అలీఖాన్ కూడా బయటపెట్టింది. కరణ్ జోహార్ ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సీజన్ లో ఒక ఎపిసోడ్లో సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ కలిసి హాజరయ్యారు. అందులో భాగంగా మీకు ఎవరితో డేటింగ్ చేయాలని ఉంది అని సారా అలీఖాన్ ను ప్రశ్నిస్తే తొలుత ఆమె ఎలాంటి సమాధానం చెప్పడానికి ఆసక్తి చూపించలేదు కానీ చివరికి విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని ఉంది అంటూ కామెంట్ చేసింది. అయితే జాన్వికి కూడా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అనే సంగతి మీకు తెలుసా అంటే ఇద్దరూ నవ్వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)