KTR On Balagam: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలతో అద్భుతమైన సినిమా తీశావ్.. బలగం మూవీ డైరెక్టర్ వేణుకు మంత్రి కేటీఆర్ అభినందన
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చక్కగా చూపించిన ‘బలగం’ సినిమా డైరెక్టర్ యెల్దండి వేణును మంత్రి కేటీఆర్ అభినందించారు. తాను 'బలగం' సినిమా చూశానని, అద్భుతంగా తీసినట్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.
Hyderabad, March 28: తెలంగాణ (Telangana) సంస్కృతి, సంప్రదాయాలను చక్కగా చూపించిన ‘బలగం’ (Balagam) సినిమా డైరెక్టర్ యెల్దండి వేణును (Venu) మంత్రి కేటీఆర్ (KTR) అభినందించారు. తాను 'బలగం' సినిమా చూశానని, అద్భుతంగా తీసినట్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో జరిగిన ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం అనంతరం, అక్కడికి వేణును ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి స్వయంగా ఆలింగనం చేసుకుని, శాలువాతో సత్కరించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలను చక్కగా చూపించారని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు డైరెక్టర్ వేణు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రితో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా, మంత్రి కేటీఆర్ స్వయంగా ఫోన్‌లో సెల్ఫీ తీసి ఇవ్వడం గమనార్హం.
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Advertisement
Advertisement