Laila Movie X Review in Telugu: లైలా మూవీ డిజాస్టర్ అంటున్న నెటిజన్లు, ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న DisasterLailaMovie హ్యాష్ ట్యాగ్, వివాదాలే కొంప ముంచాయా..?
రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ నటించిన తాజా చిత్రం మూవీ ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎక్స్ వేదికగా నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే
రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ నటించిన తాజా చిత్రం లైలా మూవీ ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎక్స్ వేదికగా నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘లేటెస్ట్ లీ ’ ఎటవంటి బాధ్యత వహించదు.
ట్విట్టర్ అదే ఎక్స్ లో సినిమా బాగుందని కొంతమంది అంటుంటే..బాగోలేదని మరికొంత మంది కామెంట్ (Laila Movie X Review in Telugu) చేస్తున్నారు. కథలో కొత్తదనం లేదని.. విశ్వక్ సేన్ తప్ప సినిమా చెప్పుకోవడానికి ఏమి లేదని అంటున్నారు.కథ ఎప్పుడో పాత చింతకాయ పచ్చడిలా ఉంది. స్క్రీన్‌ప్లే, మ్యూజిక్ కూడా యావరేజ్, విశ్వక్ సేన్ కష్టం వృథా అయిపోయింది. లేడీ గెటప్‌లో విశ్వక్ బాగున్నాడు’ అంటూ ఓ నెటిజన్ 2 రేటింగ్ ఇచ్చాడు. విశ్వక్ కెరీర్‌లో రాడ్ మూవీ లైలా. ఒక్క పాజిటివ్ సీన్ కూడా లేదు. క్రింజ్ కామెడీ సీన్స్, డబుల్ మీనింగ్, వల్గర్ డైలాగ్స్ తప్ప కథేమి లేదు. విశ్వక్ ఈ స్టోరీని ఎలా ఒప్పుకున్నాడో తెలియదు అంటూ మరో నెటిజన్ 0.25 రేటింగ్ ఇచ్చాడు.
Here's Netizens Tweets in X
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)