Lata Mangeshkar Covid: కరోనా బారీన పడిన లతా మంగేష్కర్‌, ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయని, దయచేసి మా గోప్యతను గౌరవించండి అంటూ ఆమె మేనకోడలు ట్వీట్

ప్రఖ్యాత గాయని భారతరత్న లతా మంగేష్కర్‌(92)కు కోవిడ్‌ సోకింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని లతా మంగేష్కర్‌ మేనకోడలు రచనా ద్రువీకరించారు.'స్వల్ప లక్షణాలున్నాయి. కానీ వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో ఉంచారు.

Lata Mangeshkar (Photo Credits: Twitter)

ప్రఖ్యాత గాయని భారతరత్న లతా మంగేష్కర్‌(92)కు కోవిడ్‌ సోకింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని లతా మంగేష్కర్‌ మేనకోడలు రచనా ద్రువీకరించారు.'స్వల్ప లక్షణాలున్నాయి. కానీ వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో ఉంచారు. దయచేసి మా గోప్యతను గౌరవించండి' అని పేర్కొన్నారు. కాగా గతంలో 2019లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్‌ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. 1929,సెప్టెంబర్‌​28న జన్మించిన లతా మంగేష్కర్ భారత అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కె, పద్మ భూషణ్, పద్మవిభూషణ్, సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇండియన్‌ నైటింగల్‌గా పేరు సంపాదించిన ఆమె ఇప్పటివరకు 50వేలకు పైగా పాటలు పాడారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now