Leo Movie Review: లియో మూవీ రివ్యూ ఇదిగో, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు, ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న LeoDisaster, LeoTelugu హ్యాష్‌ట్యాగ్స్
దళపతి’విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. లియో’పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.
దళపతి’విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. లియో’పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
లియోకి ట్విటర్‌లో మంచి స్పందన లభిస్తోంది. లోకేష్ మేకింగ్ అదిరిపోయిందంటున్నారు. విజయ్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల సాగదీతగా అనిపించిన ఓవరాల్‌గా లోకేష్ కనగరాజ్ గత సినిమాల మాదిరిగానే లియో కూడా స్టైలీష్‌గా ఉందని చెబుతున్నారు. అయితే సంజయ్ దత్, అర్జున్ లాంటి నటులను సరిగా వాడుకోలేకపోయారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఎక్స్ లో LeoDisaster, LeoTelugu అనే హ్యాష్ ట్యాగ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
Here's Leo Reviews in X
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)