Indira Devi Passes Away: వైరల్ వీడియో, అమ్మ కాఫీ తాగితే నాకు దేవుడి గుళ్లో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది, తల్లి గురించి గొప్పగా చెప్పిన మహేష్ బాబు
అమ్మ పట్ల తనకున్న ఇష్టాన్ని ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్ సందర్భంగా మహేశ్ బాబు బయటపెట్టారు.
మహేశ్ బాబుకు తన మాతృమూర్తి అయిన ఇందిరతో ఎంతో అనుబంధం ఉంది. అమ్మ పట్ల తనకున్న ఇష్టాన్ని ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్ సందర్భంగా మహేశ్ బాబు బయటపెట్టారు. ఎప్పుడూ సినిమా రిలీజ్‌కు ముందు తాను అమ్మ దగ్గరకు వెళ్లి కాఫీ తాగుతానని చెప్పిన ప్రిన్స్.. ఆ కాఫీ తాగితే నాకు దేవుడి గుళ్లో ప్రసాదం తిన్నట్టుగా ఉంటుంది. ఆవిడ ఆశీస్సులు నాకెంతో ముఖ్యం అంటూ మహేశ్ బాబు తన తల్లి గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి (Indira Devi) బుధవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఏఐజీ హాస్పిటల్‌లో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)