Superstar Krishna Statue in Vijayawada: సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ, కమల్ హాసన్, దేవినేని అవినాష్‌కి ధన్యవాదాలు తెలిపిన మహేష్ బాబు
నాన్న (కృష్ణ) గారి విగ్రహం ఆవిష్కరించినందుకు కమల్ హాసన్ గారికి, దేవినేని అవినాష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లినా.. ఒక అభిమాని కుటుంబాన్ని మా సొంతం చేసి వెళ్లారు. ఫ్యాన్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు”
దివంగత నటుడు కృష్ణ మరణించి ఏడాది పూర్తి అవ్వొస్తుంది. గత ఏడాది నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లిన సంగతి విదితమే.అభిమానులు విజయవాడ గురునానక్ కాలనీలో కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ చేతులు మీదుగా జరిపించారు. ఇక ఈ కార్యక్రమాన్ని విజయవాడ వైసీపీ లీడర్ దేవినేని అవినాష్ దగ్గరుండి జరిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దీనిపై మహేష్ బాబు ట్వీట్ చేశారు. “నాన్న (కృష్ణ) గారి విగ్రహం ఆవిష్కరించినందుకు కమల్ హాసన్ గారికి, దేవినేని అవినాష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లినా.. ఒక అభిమాని కుటుంబాన్ని మా సొంతం చేసి వెళ్లారు. ఫ్యాన్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ పేర్కొన్నారు.ఇటీవల కృష్ణ స్వస్థలం బుర్రిపాలెం ఒక విగ్రహావిష్కరణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు తప్ప కృష్ణ కుటుంబసభ్యులంతా హాజరయ్యి సంతోషం వ్యక్తం చేశారు.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)