Vinod Thomas: ప్రముఖ మలయాళ నటుడి అనుమానాస్పద మృతి.. పార్క్‌ చేసి ఉన్న కారులో విగతజీవిగా కనిపించిన నటుడు వినోద్ థామస్

మలయాళ నటుడు వినోద్ థామస్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కొట్టాయం జిల్లా పాంపడి ప్రాంతంలోని ఓ హోటల్‌ సిబ్బంది తమ హోటల్ పరిసరాల్లో కారులో ఓ వ్యక్తి చాలాసేపు చలనం లేకుండా ఉండిపోవడం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

Vinod Thomas (Credits: X)

Newdelhi, Nov 19: మలయాళ నటుడు (Mollywood Actor) వినోద్ థామస్ (Vinod Thomas) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కొట్టాయం జిల్లా పాంపడి ప్రాంతంలోని ఓ హోటల్‌ సిబ్బంది తమ హోటల్ పరిసరాల్లో కారులో ఓ వ్యక్తి చాలాసేపు చలనం లేకుండా ఉండిపోవడం గుర్తించి పోలీసులకు (Police) సమాచారం అందించారు. దీంతో, వినోద్ మరణం గురించి వెలుగులోకి వచ్చింది. వినోద్ మరణానికి గల కారణమేంటో ఇంకా తెలియరాలేదు. కారు ఏసీలోని విషపూరిత వాయువు పీల్చడంతో అతడు మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. హ్యాపీ వెడ్డింగ్, జూన్ వంటి చిత్రాలతో వినోద్ థామస్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

Mansoor Ali Khan-Trisha Row: త్రిష తో‌ రేప్ సీన్ మిస్సయ్యానంటూ నటుడు మన్సూర్ అలీ ఖాన్ షాకింగ్ వ్యాఖ్య.. మన్సూర్‌ పై మండిపడ్డ నటి, అతడితో ఎప్పటికీ నటించనంటూ ట్వీట్.. నటికి బాసటగా నిలిచిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement