Ravi Teja Reppal Dappul Song Out: రవితేజ మిస్టర్ బచ్చన్ నుంచి రెప్పల్ డప్పుల్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ఇదిగో, నెట్టింట వైరల్ అవుతోన్న మాస్ మహారాజా సాంగ్
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) నుంచి రెప్పల్ డప్పుల్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌మ మొదలైన విషయం తెలిసిందే
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) నుంచి రెప్పల్ డప్పుల్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌మ మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే లాంచ్ చేసిన మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ సితార్ సాంగ్ నెట్టింట సూపర్ రెస్పాన్స్‌తో మిలియన్లకుపైగా వ్యూస్ రాబడుతూ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది.
మరోవైపు సెకండ్ సింగిల్ రెప్పల్ డప్పుల్ సాంగ్ ప్రోమో కూడా వైరల్ అవుతోంది.రవితేజ, భాగ్య శ్రీ బోర్సే కాంబోలో ఊరమాస్‌గా ఈ సాంగ్ వస్తోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడారు. మిస్టర్ బచ్చన్ టైటిల్ పోస్టర్‌లో మాస్ మహారాజా అమితాబ్ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)