Godfather Trailer: మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు,చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక అన్ని రంగులు మారతాయి,దుమ్ము రేపిన గాడ్ ఫాదర్‌ ట్రైలర్‌

మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'గాడ్ ఫాదర్‌' ట్రైలర్‌ వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ సందడి చేస్తోంది. 'మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక.. అన్ని రంగులు మారతాయి' ‍అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.

Megastar Chiranjeevi's Godfather First Look

మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన 'గాడ్ ఫాదర్‌' ట్రైలర్‌ వచ్చేసింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ సందడి చేస్తోంది. 'మంచోళ్లు అందరూ మంచోళ్లు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక.. అన్ని రంగులు మారతాయి' ‍అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్‌లో చిరంజీవి యాక్షన్‌, పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. కీలక పాత్రలో నటించిన సల్మాన్ యాక్షన్ కూడా అదిరింది.

తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన లూసిఫర్‌కి తెలుగు రీమేక్‌ ఈ చిత్రం. అనంతపురంలో భారీస్థాయిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాడ్ ఫాదర్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement