‘Miss Shetty Mr Polishetty’ teaser: శెట్టి - పొలిశెట్టి.. కామెడీ టైమింగ్‌ పర్‌ఫెక్ట్‌.. 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'గా వినోదాలు పంచేందుకు అనుష్క, నవీన్‌ పొలిశెట్టి సిద్ధమయ్యారోచ్!!

ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని పి.మహేష్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Anushka Shetty (Photo Credits: Facebook)

Hyderabad, May 1: 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'గా (Miss Shetty Mr Polishetty) వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు అనుష్క (Anushka), నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty). ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని పి.మహేష్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఒక చెఫ్‌కు, ఓ స్టాండప్‌ కమెడియన్‌ మధ్య సాగే వినూత్నమైన ప్రేమ కథా చిత్రమిది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. దీనికి తగ్గట్లుగానే ప్రచార చిత్రాన్ని ఓ ఫన్‌ రైడ్‌లా సిద్ధం చేశారు. ''ఫుడ్‌ ఏమీ మ్యాజిక్‌ కాదు. ఇట్స్‌ ఎ సైన్స్‌'' అంటూ అనుష్క చెప్పే డైలాగ్‌తో టీజర్‌ ఆసక్తికరంగా మొదలవుతుంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Virupaksha OTT Streaming : 'విరూపాక్ష' ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే?

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)