
Hyderabad, FEB 19: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే ప్రపంచ అందాల పోటీలకు (Miss World Beauty Pageant) తెలంగాణ వేదిక కానున్నది. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు (Miss World Beauty Pageant) తెలంగాణ (Telangana) ఆతిథ్యం ఇవ్వనున్నది. దాదాపు నాలుగు వారాల పాటు జరిగే ఈ పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలతో పాటు గ్రాండ్ ఫినాలేను సైతం హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో 120కిపైగా దేశాలు పాల్గొంటాయి. బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే థీమ్‌తో ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనుండగా.. దేశ విదేశాల ప్రతినిధులకు తెలంగాణ స్వాగతం పలుకబోతున్నది.
Health Tips: ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహార పదార్థాల జోలికి వెళ్ళకూడదు..
మే 7 నుంచి ఈ అందాల పోటీలు జరగనున్నాయి. మే 31న గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. గతంలో న్యూఢిల్లీ, ముంబయి నగరాల్లో ఈ అందాల పోటీలు జరిగాయి. 71వ ఎడిషన్ ముంబయిలో నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్న హైదరాబాద్ ఇప్పటికే పలు అంతర్జాతీయ వేడుకలకు వేదికైంది. తెలంగాణను పర్యాటకంగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాయి. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో టూరిజం శాఖ దేశ విదేశీ పర్యాటకులను ఇప్పటికే ఆహ్వానిస్తుంది. గొప్ప చేనేత వారసత్వం.. అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు.. అరుదైన వంటకాలు.. విభిన్నమైన కళా వారత్వం ఉన్న తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని.. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మన్, సీఈఓ జూలియా మోర్లీ, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రకటించారు.